అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్న ప్రభుత్వం
● మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్
రామగిరి(మంథని): ప్రజల ఆకాంక్షతో సాధించుకున్న తెలంగాణ అస్తిత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తోందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ విమర్శించారు. సెంటినరీకాలనీలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనపై దృష్టి పెట్టకుండా పేర్లు, రూపాలను మార్చడంపై దృష్టి కేంద్రీకరించడం శోచనీయమన్నారు. ప్రధానంగా తెలంగాణతల్లి రూపుమార్చి తెలంగాణ ఆత్మగౌరవన్ని దెబ్బతీస్తోందని ధ్వజమెత్తారు. రామగిరిగడ్డపై త్వరలోనే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శంకేశీ రవీందర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణగౌడ్, నాయకులు మ్యాదరబొయిన కుమార్ యాదవ్, కాపురబొయిన భాస్కర్, దర్శుల రాజసంపత్, రోడ్డ శ్రీనివాస్, ఆసం తిరుపతి, దేవ శ్రీనివాస్, లడ్డు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment