ఉద్యోగాల భర్తీకి కౌన్సెలింగ్
గోదావరిఖని: సింగరేణిలోని వివిధ బొగ్గు గనుల్లో ఖాళీగా ఉన్న షాట్‌ఫైరర్ పోస్టుల భర్తీ కోధా ఆ సంస్థ అధికారులు సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. అంతర్గత అభ్యర్థుల కోసం వారు ఈ కౌన్సెలింగ్ నిర్వహించారు. స్థానిక టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్(టీటీసీ)లో ఈ కార్యక్రమం చేపట్టారు. సింగరేణి సంస్థ వ్యాప్తంగా సుమారు 79 ఖాళీలు భర్తీ చేసేందుకు కౌన్సెలింగ్ ఏర్పాటు చేశారు. దీనికి ఆర్జీ–1, 2, 3తోపాటు భూపాలపల్లి ఏరియాకు చెందిన 28 మంది అంతర్గత ఉద్యోగులు హాజరయ్యారు. కౌన్సెలింగ్ కమిటీ ఇన్‌చార్జి ఆంజనేయప్రసాద్, పర్సనల్ మేనేజర్ రవీందర్‌రెడ్డి, అధికారులు రాజన్న, రామయ్య తదితరులు అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎంపికైన వారి జాబితాను త్వరలో వెల్లడించే అవకాశం ఉందని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment