● 48.22 శాతం మంది అభ్యర్థుల హాజరు
గోదావరిఖని: జిల్లావ్యాప్తంగా ఈనెల 15, 16వ తేదీల్లో నిర్వహించిన గ్రూప్–2 పరీక్షలకు 9,018 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈనెల 15న ఉదయం నిర్వహించిన పరీక్షకు 4,450మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 4,410 మంది అభ్యర్థులు హాజరయ్యారు. జిల్లాలో మొత్తం 18 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈమేరకు ప్రభుత్వ యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. నిర్ణీత సమయంలోగా చేరుకున్న వారిని తనిఖీ చేసి పరీక్షహాల్‌లోకి అనుమతించారు. ఉదయం హిస్టిరీ, సాయంత్రం పొలిటికల్ సైన్స్ పరీక్షలు నిర్వహించినట్లు ఎగ్జామినేషన్ అధికారులు తెలిపారు. రెండోరోజు నిర్వహించిన పరీక్షలకు 9,018 మంది హాజరవుతారని భావించినా.. ఉదయం పరీక్షకు 4,349 మంది, మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 4,346మంది హాజరయ్యారు. రెండోరోజు ఉద యం ఎకానమీ, మధ్యాహ్నం తెలంగాణ ఉద్య మం పరీక్షలు నిర్వహించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో సగం మందికిపైగా పరీక్షలకు దూరంగా ఉండడం గమనార్హం. దీంతో కొన్ని పరీక్ష కేంద్రాలు అభ్యర్థులు లేక ఖాళీగా కనిపించాయి. కలెక్టర్, రామగుండం పోలీస్ కమిషనర్ సారథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రెండురోజులు పాటు పరీక్షలు సజావుగా కొనసాగాయి.
జేఎన్టీయూలో..
రామగిరి(మంథని): సెంటినరీకాలనీలోని మంథని జేఎన్టీయూ పరీక్ష కేంద్రంలో సోమవారం గ్రూప్– 2 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 932 మంది అభ్యర్థులకు 482 మంది హాజరైనట్లు ప్రిన్సిపాల్ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీ,, ప్రత్యేక పరిశీలకుడు సురేశ్ పరీక్షలు పర్యవేక్షించారు. సీఐ రాజుగౌడ్, ఎస్సై చంద్రకుమార్ ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment