ప్రజా సమస్యలు పరిష్కరించాలి
● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లిరూరల్: ప్రజావాణి ద్వారా అందిన అర్జీలను సంబంధిత అధికారులు పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభాగ్యుల నుంచి ఆయన అదనపు కలెక్టర్ వేణుతో కలిసి పలు సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణిలో అందించే అర్జీలకు తప్పకుండా పరిష్కారం లభిస్తుందనే నమ్మకంతో చాలామంది ఇక్కడకు వస్తుంటారని, వారి నమ్మకాన్ని నిలబెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. అర్జీల్లోని కొన్ని సమస్యలు ఇవీ..
Comments
Please login to add a commentAdd a comment