● ప్రశ్నపత్రంలో దాదాపు 13 ప్రశ్నలు ● జగపతిరావు నుంచి వినోద్‌కుమార్ వరకు ప్రస్తావన ● జగిత్యాల జైత్రయాత్ర నుంచి మల్హర్‌రావు హత్య వరకు కూడా..
సాక్షిప్రతినిధి, కరీంనగర్: గ్రూప్–2 పరీక్షలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన సమాచారంపై ప్రశ్నలు అడిగారు. ముఖ్యంగా పేపర్–3లో మూడు ప్రశ్నలు, పేపర్–4లో 10 ప్రశ్నలు అడగడం తెలంగాణ ఉద్యమ చరిత్రలో జిల్లా ప్రాధాన్యం చెప్పినట్లయ్యింది. ఉమ్మడి జిల్లాలోని వనరులు, ఆర్థిక స్థితిగతులు, రాజకీయ నాయకుల పాత్ర తదితర అంశాలపై ప్రశ్నలు అడగడం విశేషం.
పేపర్ –4లోనూ..
పేపర్–4లో దాదాపు 10 వరకు ప్రశ్నలు పాత జిల్లా ప్రస్తావన అధికంగా కనిపించింది. పేపర్–4లో చొక్కారావు– తెలంగాణ హక్కుల రక్షణ సమితి అధ్యక్షుడిగా పనిచేశారా? అని 29 ప్రశ్నగా అడిగారు. బెజ్జంకి జాతరలో లక్ష్మీనరసింహస్వామి గురించి 48వ ప్రశ్నకింద అడిగారు. మా జీ ఎమ్మెల్యే జగపతిరావు రాజకీయ ప్రస్థానంలో మైలురాళ్లపై 68వ ప్రశ్నగా ఇచ్చారు. తెలంగాణ సభ్యుల ఫోరం ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడిందన్న సందర్భంలో మరోసారి వెలిచాల జగపతిరావు పేరును ప్రస్తావించడం విశేషం. సిరిసిల్ల, జగిత్యా ల తాలూకాలను 1978లో కల్లోలిత ప్రాంతాలు గా పరిగణించారు అని 83వ ప్రశ్నలో చర్చించా రు. 84వ ప్రశ్నలో జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో వ్యవసాయ కార్మికుల సమావేశం, మంథనిలో కొండపల్లి సీతారామయ్య ‘గ్రామాలకు వెళ్లండి’ అని విద్యార్థులకు ఇచ్చిన పిలుపు గురించి అడిగారు. తాడిచర్ల మండలం అధ్యక్షుడు మల్హర్‌రావును అప్పటి పీపుల్స్‌వార్(ప్రస్తుత మావో యిస్ట్) పార్టీ హత్య చేసిన విషయాన్ని 91వ ప్రశ్నలో అడిగారు. 93వ ప్రశ్నలో 1978లో జగిత్యాల జైత్రయాత్ర విశేషాల గురించి ప్రస్తావించారు. 102లో కరీంనగర్ ప్లార్లమెంట్‌కు ఎన్నికై న టీఆర్‌ఎస్ నాయకుల పేర్లు అడిగారు. టీఆర్‌ఎస్ పార్టీ కరీంనగర్ కదనభేరీ పేరిట నిర్వహించిన సభపై 131వ ప్రశ్నగా అడిగారు. 116వ ప్రశ్నలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రస్తావన వచ్చింది. ఇక పేపర్–3లో పేద జిల్లాలను గుర్తించే క్రమంలో కరీంనగర్ ప్రస్తావన 78వ ప్రశ్నలో, పంట వైవి ధ్యంపై ప్రస్తావించిన క్రమంలో పెద్దపల్లి చర్చ 85వ ప్రశ్నగా, వరి పంట విస్తీర్ణం విషయంలో 85వ ప్రశ్నలో చర్చించారు. మొత్తానికి ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేతలు చొ క్కారావు, వెలిచాల జగపతిరావు, మల్హర్‌రావు, వినోద్‌కుమార్ ప్రస్తావన రావడం, జగిత్యాల జైత్రయాత్ర, సిరిసిల్లలో టీఆర్‌ఎస్ ఉద్యమ సభ, జగిత్యాలలో రైతు పోరాటాలు, మంథనిలో పీపుల్స్‌వార్ కార్యకలాపాలపై అడిగిన ప్రశ్నలు పాతజిల్లా జ్ఞాపకాలను తట్టిలేపాయి. నాడు జరిగిన ఉద్యమాలు, దుర్ఘటనలు, హత్యలు నేటి యువత చరిత్రగా చదువుకుంటున్న తీరును సీనియర్ సిటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment