మూడు కోణాలు.. 180 డిగ్రీలు
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలంలోని తక్కళ్లపెల్లి జెడ్పీ హైస్కూల్‌కు చెందిన మామిడి శ్రీహిత అనే పదోతరగతి విద్యార్థిని రూపొందించిన గణిత ప్రాజెక్టు రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్ మనాక్ పోటీలకు ఎంపికై ంది. మ్యాథ్స్ టీచర్ గంగాధర్ ఆధ్వర్యంలో త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు, చతుర్భుజంలోని నాలుగు కోణాల మొత్తం 360 డిగ్రీలు అని కార్ట్ బోర్డుతో సహాయంతో వివరించింది. ఈ ప్రాజెక్టు వచ్చే నెలలో రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రదర్శించనున్నట్లు ఉపాధ్యాయుడు గంగాధర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment