క్రీడారంగ అభివృద్ధికి కృషి
సుల్తానాబాద్(పెద్దపల్లి): క్రీడారంగ అభివృద్ధికి ప్ర భుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశా ల మైదానంలో మూడు రోజులుగా సాగుతున్న సీ ఎం కప్ –2024 ముగింపు వేడుకలు శనివారం ని ర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, నూతన క్రీ డాపాలసీతోపాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు తో క్రీడారంగం అగ్రగామిగా నిలుస్తుందన్నారు. క్రీ డా రంగానికి పుట్టినిల్లు సుల్తానాబాద్ అని తెలిపా రు. రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాజట్టు ప్రతిభ చూపా లని సూచించారు. డీవైఎస్‌వో సురేశ్, ఎస్సై శ్రవణ్ కుమార్, అంతటి అన్నయ్యగౌడ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment