అర్హులందరికీ పథకాల వర్తింపు
పెద్దపల్లిరూరల్/జ్యోతినగర్/మంథని: ప్రభుత్వం ఈనెల 26న ప్రారంభించే సంక్షేమ పథకాల ఫలా ల ను అర్హులైన వారందరికీ అందించాలని కలెక్టర్ కో య శ్రీహర్ష ఆదేశించారు. పెద్దపల్లి అమర్‌చంద్ క ల్యాణ మండపం, మంథని శ్రీలక్ష్మీభారతి ఫంక్షన్‌హాల్, జ్యోతినగర్ ఉద్యోగ వికాస కేంద్రాల్లో బుధవారం జరిగిన పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాలస్థాయి సమన్వయ సమావేశంలో అడిషనల్ కలెకర్లు అరుణశ్రీ, వేణుతో కలిసి అధికా రులకు దిశానిర్దేశం చేశారు. రైతుభరోసా, ఇందిర మ్మ ఆత్మీయభరోసా, ఆహారభద్రత, ఇందిరమ్మ ఇ ళ్ల లబ్ధిదారుల ఎంపికకు ఈనెల 23లోగా గ్రామసభలు నిర్వహించాలని, రైతుభరోసా కోసం వ్యవసాయానికి యోగ్యంకాని భూ ములు గుర్తించి జాబితా నుంచి తొలగించాలన్నారు. పరిశ్రమల, నాలా కన్వర్షన్, లేఔట్, మైనింగ్ భూములను కచ్చితంగా జా బితా నుంచి తొలగించాలని ఆదేశించారు. ఆత్మీయ భరోసా పథకం కోసం కుటుంబాన్ని యూనిట్‌గా పరిగణించాలని, ఇది వ్యక్తిగత పథకం కాదన్నారు. రేషన్‌కార్డుల జారీకోసం గ్రామ, వార్డుల వారీగా సభలు నిర్వహించి అరుల జాబితా రూపొందించాల ని అన్నారు. ఇందిరమ్మ పథకంలో పేదలకు ప్రాధా న్యం ఇవ్వాలని, దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలని పేర్కొన్నారు. ఈ నె ల 23లోగా ఎంపిక పూర్తిచేసిన జాబితాను ఈనెల 25లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, 26న పథకాల అమలును ప్రారంభించాలని ఆదేశించారు. డీ ఆర్డీవో కాళిందిని, డీపీవో వీరబుచ్చయ్య, డీఏవో ఆ దిరెడ్డి, జెడ్పీ సీఈవో నరేందర్, డీసీవో శ్రీమాల, ఆ ర్డీవోలు గంగయ్య, సురేశ్, మార్కెటింగ్ అధికారి ప్ర వీణ్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, తహసీల్దార్లు రాజ్‌కుమార్, కుమారస్వామి పాల్గొన్నారు.
26 నుంచి లబ్ధిదారులకు పథకాల ఫలాలు అందాలి
కలెక్టర్ కోయ శ్రీహర్ష
Comments
Please login to add a commentAdd a comment