బీఆర్‌ఎస్ హయాంలోనే నీటి సమస్య
ధర్మారం(ధర్మపురి): బీఆర్‌ఎస్ హయాంలోనే రైతులకు సాగునీటి కష్టాలు ఎదురయ్యాయని ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌కుమార్ విమర్శించారు. నందిమేడారం రిజర్వాయర్‌ను బుధవారం ఆయన పరిశీలించారు. మేడారం చెరువును రిజర్వాయర్‌గా మార్చి స్థానిక ఆయకట్టుకు కాకుండా సిద్దిపేట, సిరిసిల్లకు నీటిని తరలించారని ఆయన ఆరోపించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సాగునీటి సమస్యలు పరిష్కరించకుండా కేటీఆర్, హరీశ్‌రావు మెప్పు కోసం నీటిని తరలించేందుకు ప్రోత్సహించారని విప్ ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సమస్య విన్నవించగా.. ఒక టీఎంసీ నీ టిని గోదావరి నదిలోకి విడుదల చేశారని, దీంతోనే మేడారం రిజర్వాయర్‌లోకి ఆ నీటిని మళ్లిస్తున్నా మని తెలిపారు. రిజర్వాయర్ నీటిని మిడ్‌మానేర్‌కు తరలిస్తున్నందున డెడ్‌స్టోరేజీ ఏర్పడుతుందని, ఆ స్థాయి చేరకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, మాజీ చైర్మన్ కొత్త నర్సింహులు, మాజీ వైస్ చైర్మన్‌లు కాడే సూర్యనారాయణ, పాలకుర్తి రాజేశంగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, నాయకులు దేవి జనార్దన్, గందం మహేందర్, కాంపెల్లి రాజేశం, మహిపాల్, ఉత్తెం రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
మేడారం రిజర్వాయర్ పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment