ఉచిత ఇసుకతో పడిపోయిన డిమాండ్
రామగుండం: అంతర్గాం మండల పరిధి గోలివాడ ఇసుక రీచ్ నుంచి సొంత అవసరాలకు ఉచితంగా ఇసుకను సేకరించుకునే అధికారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో గురువారం వేకువజాము నుంచే ఇసుక రీచ్‌కు వందలాది ట్రాక్టర్లు క్యూ కట్టాయి. అయితే సొంత అవసరాలకు ఇసుక సేకరణ విధానం మంచిదే కాగా, కొంతమంది బడా కాంట్రాక్టర్లకు వరంగా మారింది.
కొరవడిన స్పష్టత
● ఉచిత ఇసుక సేకరణపై ప్రభుత్వం స్పష్టమైన గైడ్‌లైన్స్ ప్రకటించకపోవడంతో రవాణాదారులు, అధికారుల్లో అస్పష్టత నెలకొంది.
● గతంలో సాండ్ టాక్సీ నిర్వాహకులు ప్రభుత్వం వద్ద చేసిన డిపాజిట్ డబ్బుల విషయమై ఏలాంటి ఊసేలేదు.
● క్లాస్–1 సివిల్ కాంట్రాక్టర్లు గతంలో నిబంధనల మేరకు మైనింగ్‌శాఖకు రుసుము చెల్లించి ఇసుక పొందే అవకాశం ఉండేది. ప్రస్తుతం అతి తక్కువ ధరకు ఇసుక లభ్యం కావడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది.
● ఉచిత ఇసుక సేకరణతో ట్రాక్టర్ యజమానుల మధ్య పోటీ ఎక్కువై అతి తక్కువ ధరకు ఇసుక సరఫరా చేస్తుండగా, కొంతమంది ఆర్థిక ఇబ్బందులకు లోనవుతున్నారు.
● సాండ్ టాక్సీ సమయంలోనే గోలివాడ రీచ్‌కు వెళ్లే రహదారి భారీ గుంతలు ఏర్పడి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆ సమయంలో సాండ్ టాక్సీతో ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం సమకూరినా కనీసం రోడ్డు సౌకర్యం కల్పించలేదనే విషయం బహిరంగ రహస్యం.
● ప్రస్తుతం ఇసుక రీచ్‌ల వద్ద మైనింగ్ ప్రతినిధులు ట్రాక్టర్ల వివరాలు, లోడింగ్ సమయం, వినియోగదారుల వివరాలు నమోదు చేసుకుంటున్నా వాటితో ఏ ఫలితం ఉంటుందనే విషయమై వారికే స్పష్టత లేదు. ఉచిత ఇసుక సేకరణ కేవలం సాండ్ టాక్సీ రిజిష్ట్రేషన్ ట్రాక్టర్లకేనా, ఇతర ట్రాక్టర్లు కూడా తీసుకెళ్లే అవకాశం ఉంటుందా అనే దానిపై స్పష్టత లేదు.
● ఈ విషయమై మైనింగ్ అధికారులను వివరణ కోరగా, తమకు ఎలాంటి గైడ్‌లైన్స్ రాలేదని, త్వరలోనే పూర్తి నిబంధనలు వస్తాయని పేర్కొన్నారు.
ఆందోళనలో సాండ్ టాక్సీ ట్రాక్టర్ ఓనర్లు
Comments
Please login to add a commentAdd a comment