ముగ్గురు వైద్య సిబ్బంది సస్పెన్షన్
రామగిరి(మంథని): మండలంలోని బేగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ముగ్గురు వైద్య సిబ్బందిని కలెక్టర్ కోయ శ్రీహర్ష సస్పెండ్ చేశారు. మండల వైద్యాధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గురువారం ఉదయం సుమారు 11.45 గంటల సమయంలో బేగంపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది విధులకు గైర్హాజరు కావడం గమనించారు. హాజరు రిజిస్టర్లు పరిశీలించగా సదరు సిబ్బంది అనుమతి లేకుండా చాలా రోజులుగా విధులకు గైర్హాజరవడం గమనించిన కలెక్టర్ పలుమార్లు వారికి మెమోలు జారీ చేశారు. అయినా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నర్సింగ్ సిబ్బంది ఇ.ఉమాదేవి, హెల్త్ సూపర్‌వైజర్ కె.పుష్పవతి, ఎంపీహెచ్‌ఈవో సీతారామయ్యను సస్పెండ్ చేశారు. మండల వైద్యాధికారి డా.జె.ప్రదీప్‌కుమార్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
అర్హులకు పథకాలు అందేలా సర్వే చేయాలి
కమాన్‌పూర్(మంథని): సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా సర్వే చేయాలని అదనపు కలెక్టర్ వేణు సూచించారు. గురువారం మండలంలోని జూలపల్లి గ్రామంలో ౖపథకాల సర్వే తీరును పరిశీలించారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న నాలుగు పథకాలను గణతంత్ర దినోత్సవం నుంచి అమలు చేస్తుందన్నారు. తహసీల్దార్ వాసంతి, ఆర్‌ఐ స్రవంతి, ఏవో రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి శంకర్ తదితరులున్నారు.
రహదారి భద్రతపై అవగాహన
పాలకుర్తి(రామగుండం): జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా గురువారం పాలకుర్తి మండలం కన్నాల టోల్‌ప్లాజా వద్ద ఆర్టీఏ అధికారులు అవగాహన కల్పించారు. పెద్దపల్లి డీటీవో రంగారావు, ఎంవీఐ మసూద్‌ఆలీ, ఇన్‌స్పెక్టర్ స్వప్న, సిబ్బంది పాల్గొని వాహనదారులకు ట్రాఫిక్ నియమాల గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈసందర్భంగా హెల్మెట్ ధరించిన వాహనదారులకు పువ్వులు అందించారు.
సమస్యలు పరిష్కరించండి
గోదావరిఖని: సింగరేణి కార్మిక వాడల్లో సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక ఐబీ కాలనీలోని టీటూ క్వార్టర్స్ ఏరియాలో గురువారం ఆకస్మిక త నిఖీ చేశారు. స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదు ల మేరకు గతంలోనే ఈ ప్రాంతాన్ని సందర్శించామన్నారు. పనులు పూర్తి చేయడంలో కొంత జాప్యం జరిగిందని, సమస్యలు త్వరలోనే పరిష్కరించేలా చూస్తామని పేర్కొన్నారు. నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేసి కార్మికులకు ఇబ్బంది లేకుండా చూడాలని సివిల్ అధికారులను ఆదేశించారు. సివిల్ ఇంజనీర్ దుర్గాప్రసాద్, సివిల్ సూపర్‌వైజర్ రాంచందర్, సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి, జూని యర్ ఇన్‌స్పెక్టర్ ఉమేశ్, అక్బర్ అలీ పాల్గొన్నారు.
భౌతిక దాడులు సరికాదు
గోదావరిఖని(రామగుండం): కార్మికులపై భౌతిక దాడులు సరికాదని సీఐటీయూ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి పేర్కొన్నారు. జీడీకే–11గనిలో ఓవర్‌మెన్ శ్రీనివాస్‌రావు చేతిలో గాయపడిన కార్మికుడు మేడ అజయ్‌ను గురువారం పరామర్శించారు. మైనింగ్, టెక్నికల్ స్టాఫ్‌ను ఒత్తిడి లేకుండా పనిచేయించుకునేలా చూడాలన్నారు. అధికారులకు, కార్మికులకు మఽ ద్య సూపర్‌వైజర్లు నలిగిపోయి దాడులు చేసుకోవడం వారి హోదాకు సరికాదన్నారు.
విచారణ చేపట్టిన ఏసీపీ
కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీపీ రమేశ్ ఏరియా ఆసుపత్రికి వెళ్లి విచారణ చేపట్టారు. దాడికి పాల్పడిన ఓవర్‌మెన్‌పై యాజమాన్యం చర్యలు తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment