ప్రమాదాల నియంత్రణకు చర్యలు
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ప్రమాదాలను నియంత్రించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. గురువారం సీఐ ప్రవీణ్‌కుమార్, ట్రాఫిక్ సీఐ అనిల్‌కుమార్‌తో పాటు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, ఏఈ సతీశ్ ఇతర అధికారులు, సిబ్బంది సిగ్నల్ వద్ద పరిశీలించారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద స్థలం ఇరుకుగా ఉండడం, సిగ్నల్ తొలగిపోగానే వాహనాలు ముందుకు రావడం అప్పటికే బస్టాండ్‌వైపు వెళ్లేందుకు యత్నించి ప్రమాదాలకు గురవుతున్నారు. కొద్దిరోజుల క్రితం మోపెడ్ పై వెళుతున్న దంపతులు లారీ కిందపడ్డా సురక్షితంగా బయటపడిన విషయం తెలిసిందే. అలాగే గతంలో పట్ట ణానికి చెందిన ప్రముఖ వ్యాపారి యాద రమణ య్య, కాంట్రాక్టర్ గంట నర్సయ్య అదే ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని ట్రాఫిక్ సీఐ తెలిపారు. సిగ్నల్ ఉన్న ప్రాంతంలో సర్కిల్‌ను మరింత విశాలంగా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
సిగ్నల్ ప్రాంతంలో సర్కిల్ వెడల్పునకు పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment