రేపటి వరకు ఖాళీ చేయండి
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి బస్టాండ్‌ను ఆనుకుని ఉన్న ఎంపీడీవో ఆఫీసుతో పాటు ఇదే ఆవరణలోని ఇతర ప్రభుత్వ శాఖల కార్యాలయాలను శనివారంలోగా ఖాళీ చేసి స్థలాన్ని ఆర్టీసీ అధికారులకు అప్పగించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గురువారం సదరు కార్యాలయాలను పరిశీలించారు. ఎంపీడీవో, పంచాయతీరాజ్, ఎంఈవో, ఎకై ్సజ్ ఆఫీసులను అనువైన భవనాల్లోకి తరలించాలని, అవసరమైతే అద్దె భవనాల్లోకి వెళ్లాలని సూచించారు. ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ రాజు, ఈఈ పోచయ్య, గోదావరిఖని డిపో మేనేజర్ నాగభూషణం, హౌజింగ్ ఈఈ రాజేశ్వర్, తహసీల్దార్ రాజ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
పనుల్లో వేగం పెంచాలి
జిల్లా ప్రభుత్వాసుపత్రికి వచ్చే వారి సౌకర్యార్థం అదనంగా మరో 42 పడకల ఏర్పాటుకు చేపట్టిన భవన నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గురువారం ఆసుపత్రిలో సాగుతున్న పనులను పరిశీలించి సూపరింటెండెంట్ శ్రీధర్‌కు పలు సూచనలు చేశారు.
దళారులను నమ్మి మోసపోవద్దు
ప్రభుత్వం ఈనెల 26 నుంచి అమలు చేయనున్న ప థకాలను వర్తింపజేస్తామంటూ దళారులు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని కలెక్టర్ శ్రీహర్ష అ న్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందన్నారు. అర్హుల పేర్లు గ్రామసభల్లో చదివి వి నిపిస్తారని, అనర్హులని తేలితే జాబితా నుంచి పేరు తొలగిస్తారని స్పష్టం చేశారు. అర్హులకే పథకాలు అందుతాయని పేర్కొన్నారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష
Comments
Please login to add a commentAdd a comment