నృసింహుని ఆలయ అభివృద్ధికి నిధులు
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం దేవునిపల్లిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి తన వంతుగా ప్రభుత్వం నుంచి రూ.10లక్షల నిధులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే విజయరమణారావు హామీ ఇచ్చారు. గురువారం ఆలయ ధర్మకర్తల ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో ముద్దసాని శంకరయ్య తన బంధువులనుంచి విరాళాలు సేకరించి ఆలయాన్ని అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. అనంతరం ఆలయ పాలకమండలి చైర్మన్‌గా బొడ్డుపల్లి సదయ్య, సభ్యులు శ్రీపతి సుమన్, ఆడెపు సౌందర్య, ఇట్యాల సతీశ్, రాజమౌళి, సురేశ్, శ్రీనివాస్, ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా ఆలయ అర్చకుడు లక్ష్మినర్సింహచార్యులతో దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ సుజాత, ఈవో శంకరయ్య ప్రమాణం చేయించారు. నాయకులు బండారి రామ్మూర్తి, సంపత్, బొక్కల సంతోష్, మల్లయ్య, ఎడెల్లి శంకర్, అవినాష్, ఆరె సంతోష్, మహేందర్, రాజు తదితరులున్నారు.
ఎమ్మెల్యే విజయరమణారావు
Comments
Please login to add a commentAdd a comment