క్షేత్రస్థాయిలో సర్వే పూర్తి కావాలి
కోల్‌సిటీ(రామగుండం): రామగుండంలో కొత్త ఆహార భద్రతా కార్డుల జారీకి క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న వెరిఫికేషన్ తీరుతోపాటు ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుదారుల సర్వేపై సూపర్ చెక్ ప్రక్రియను అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ జె.అరుణశ్రీ పరిశీలించారు. స్థానిక 38వ డివిజన్ ఇందిరానగర్‌లో గురువారం పర్యటించారు. క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 21, 22, 23వ తేదీల్లో నగరపాలక పరిధిలోని 50 డివిజన్లలో వార్డు సభలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వార్డు సభల్లోనే లబ్ధిదారుల జాబితా ప్రదర్శించి ఆయా పథకాల అర్హుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ రాయలింగు, రెవెన్యూ సూపరింటెండెంట్ ఆంజనేయులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శంకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment