నిబంధనలు పాటిస్తేనే భద్రత
పెద్దపల్లిరూరల్: డ్రైవర్లు, కాలినడకన వెళ్లేవారు రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తేనే ప్రాణాలకు భద్రత ఉంటుందని జిల్లా రవాణాశాఖ అధికారి రంగారావు అన్నారు. జిల్లాలో రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడారు. రోడ్డు భద్రతా నిబంధనలపై ద్విచక్రవాహనదారులు, ఆటో, వ్యాన్, భారీ వాహనాల ను నడిపేవారికి అవగాహన కల్పిస్తున్నామన్నారు. బైక్ నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో వెళ్లేవారు సీటుబెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. రాత్రి సమయాల్లో ఎదురుగా వచ్చే వాహనం డ్రైవర్ కంటిపై వెలుతురు పడకుండా లైట్ డిప్పర్ వాడాలన్నారు. మద్యం తాగి, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడపవద్దని సూచించారు. ప్రతీ వాహనం లైట్‌కు పైన నల్లని రంగు, లేదా స్టిక్కర్ వేసుకోవాలని సూచించారు. ప్రధాన రోడ్లు, హైవేలపై వాహనం మరమ్మతులకు గురైతే రేడియం స్టిక్కర్లతో కూడిన స్టాండ్‌ను ముందు, వెనకాల ఉంచడంతో పాటు పార్కింగ్ లైట్లు వేసి ఉంచాలని ఆయన పేర్కొన్నారు. ఈ నెలాఖరు వరకు రోడ్డుభద్రతపై అవగాహన కల్పిస్తామని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment