నేడు సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచారం ఇలా.. | Sakshi
Sakshi News home page

నేడు సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచారం ఇలా..

Published Fri, May 10 2024 4:14 AM

CM YS Jagan Election Campaign Schedule At Mangalagiri

ఉదయం 10 గంటలకు మంగళగిరిలో సీఎం జగన్‌ ప్రచార సభ   

మధ్యాహ్నం 12.30కి పుత్తూరులో.. 3 గంటలకు కడపలో.. 

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 10 గంటలకు గుంటూరు లోక్‌సభ స్థానం పరిధిలోని మంగళగిరిలో ఉన్న పాత బస్టాండ్‌ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్‌ పాల్గొంటారు. 

మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు లోక్‌సభ స్థానం పరిధిలోని నగరి నియోజకవర్గం పుత్తూరులో ఉన్న కార్వేటినగరం రోడ్‌ కాపు వీధి సర్కిల్‌లో జరిగే సభలో సీఎం పాల్గొంటారు. మధ్యా­హ్నం 3 గంటలకు కడపలోని శ్రీపొట్టి శ్రీరాములు సర్కిల్‌లో జరిగే సభలో సీఎం జగన్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.  

Advertisement
 
Advertisement