సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వంపై ఏడవటం తప్ప ప్రతిపక్షాలకు వేరే పని లేదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మా నాయకుడు సీఎం జగన్ ఒకటే చెప్తున్నారు. మేము మంచి చేశాం అనుకుంటేనే మళ్లీ నాకు అవకాశం ఇవ్వండి అంటున్నారు. అలా అనడంలో తప్పు ఏముంది?’ అని మంత్రి ప్రశ్నించారు.
వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారు. రాజధాని విషయంలో మా పార్టీ విధానం ఎప్పుడూ చెప్పాం. దానికి మేము కట్టుబడి ఉన్నాము. అలాగే.. హైదరాబాద్ విశ్వనగరం.. అక్కడ ఎవరికైనా ఆస్తులు ఉండొచ్చు. అదేం ప్రశాంత్‌రెడ్డి ఆస్తి కాదు. చంద్రబాబు అర్ధరాత్రి పారిపోయి వచ్చారు గనుకే నేడు రాజధాని లేని దుస్థితి నెలకొంది. చంద్రబాబు పాపాల వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ప్రతిపక్షాల చౌకబారు వ్యాఖ్యలపై మేం స్పందించం..
.. మా పార్టీ స్టాండ్ ఎప్పుడు కూడా విభజన హామీలు సాధించడమే. మేము ప్రజలు ఏం మేలు చేశామో అది చెప్పే ఓట్లు అడుగుతాం ఇలాంటి జిమ్మిక్కులు మాకు అవసరం లేదు. చంద్రబాబు, పవన్‌కు ఈ రాష్ట్రంలో సొంత ఇల్లు లేదు. కానీ వీళ్ళకి ఇక్కడ రాజకీయాలు కావాలి ’’ అని మంత్రి బొత్స దుయ్యబట్టారు. అలాగే.. ఉద్యోగులతో ఆల్రెడీ చర్చలు జరిపామని, పెండింగులో ఉన్న బకాయిలు వచ్చే నెలలో ఇస్తాం అని చెప్పామని మంత్రి బొత్స మీడియాకు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment