సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచిన విషయం తెలిసిందే. ఇటీవల పార్టీలో చేరికలపై కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఇక, కొందరు సీనియర్లకు కీలక పదవులు, బాధత్యలను కూడా అప్పగించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హైకమాండ్‌పై అలిగినట్టు తెలుస్తోంది.
అయితే, పార్టీలో సీనియర్, ఇన్నేళ్లుగా పార్టీలో నిబద్ధతతో పనిచేస్తే తనకు పార్టీలోని ఏ కమిటీల్లో చోటు ఇవ్వకపోవడంతో పొన్నం అసంతృప్తి వెళ్లగక్కారు. ఏ కమిటీలోనూ తనకు అవకాశం ఇవ్వకపోవడంపై తిరుగుబాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన ఇంట్లోనే డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణతో భేటీ అయ్యారు. ముఖ్య కార్యకర్తలతో అంతర్గత సమావేశం నిర్వహించారు. దీంతో, పొన్నంకు హైకమాండ్ నుంచి పిలుపు రాకపోతే రేపు.. కరీంనగర్‌లోని 7 నియోజకవర్గాల నుంచి దాదాపు 500 కార్లలో హైదరాబాద్‌కు వెళ్లి.. టీపీసీసీ చీఫ్ రేవంత్‌ను కలవనున్నట్టు కార్యకర్తలు హెచ్చరించారు.
ఇక, వీరి భేటీ అనంతరం.. కవ్వంపల్లి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో ఏ కమిటీల్లోనూ పొన్నం ప్రభాకర్ పేరు లేకపోవడం ప్రతీ కార్యకర్తకు గుండెకోతను మిగిల్చింది. పార్లమెంట్‌లో ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమనేత పొన్నం ప్రభాకర్‌ను కాంగ్రెస్ ఎలా మరిచిపోయిందని ప్రశ్నించారు. ప్రస్తుతం ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు ఇచ్చిన ప్రాధాన్యత తనకు ఇవ్వలేదని అసంతృప్తితో రగిలిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment