చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు
కంభం: మండలంలోని సూరేపల్లిలో గత నెలలో జరిగిన చోరీ కేసులో దొంగను అరెస్టు చేసి అతని వద్ద నుంచి బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. గత నెల 28వ తేదీన సూరేపల్లి గ్రామంలో ఓ గృహంలో చోరీ జరిగిన నేపథ్యంలో బాధితుడు గాలేటి వెంకటరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఐ కె. మల్లికార్జున, ఎస్సై బి. నరసింహారావు ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మార్కాపురం మండలం భూపతి పల్లి గ్రామానికి చెందిన వెన్నా ఈశ్వర రెడ్డి అనే వ్యక్తిని జంగంగుంట్ల వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా చోరీలకు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చిందన్నారు. అతని వద్ద నుండి సూరేపల్లి గ్రామంలోని ఇంట్లో దొంగిలించిన 51 బంగారు ఆభరణాలు, వెండి పట్టీలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసుతో పాటు తర్లుపాడు మండలం గోరుగుంతలపాడులో జరిగిన చోరీలోనూ ఇతనే నిందితుడని, ఆ కేసుకు సంబంధించి 9.72 గ్రాముల బంగారు ఆభరణాలు, 165 గ్రాముల వెండీ పట్టిలు స్వాధీనం చేసుకున్నామన్నారు. సూరేపల్లి చోరీలో సొత్తును విలాసాలాకు వాడుకున్నట్లు తెలిపారు. నిందుతుడిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. కేసులో కీలకంగా వ్యవహరించిన ఎస్సై నరసింహారావు, కానిస్టేబుళ్లు కాటంరాజు, బషీర్, ఆనంద్ కుమార్, రమేష్, హోంగార్డ్స్ మస్తాన్, గురుస్వామి, లాజర్, యేసులను అధికారులు ప్రత్యేకంగా అభినందించారు.
రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం
కేసు వివరాలు వెల్లడించిన మార్కాపురం
డీఎస్పీ నాగరాజు
Comments
Please login to add a commentAdd a comment