2 సెం.మీ పైకి లేచిన రాళ్లపాడు గేటు
లింగసముద్రం: రాళ్లపాడు ప్రాజెక్టు కుడి కాలువ గేటును బయటకు తీసే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం రెండు సెంటీమీటర్లు పైకి లేచినట్లు డీఈ వెంకటేశ్వర్లు చెప్పారు. ఆరో రోజు అధికారులు గేటును పైకి లేపేందుకు ప్రయత్నించగా రెండు సెంటీమీటర్లు పైకి లేచిన తర్వాత చైన్‌బ్లాక్ లింకులు, వాటికి బిగించిన రోప్‌లు తెగిపోయాయి. అధికారులతోపాటు ప్రైవేట్ మెకానిక్ బాషా, సిబ్బంది, వైజాగ్ నుంచి వచ్చిన టెక్నీషియన్లు సాయంత్రం వరకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చీకటి పడటంతో పనులను నిలిపివేసినట్లు డీఈ చెప్పారు. గేటు కాస్త పైకి లేచినపుడు 60 క్యూసెక్కుల నీరు కాలువకు విడుదలైనట్లు తెలిపారు. శనివారం కూడా గేటును పైకి లేపేందుకు ప్రయత్నిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment