పిల్లలకు పోషకాహారం అందించాలి
ఒంగోలు సిటీ: బాలసదనంలోని ఖాళీ ప్రదేశంలో న్యూట్రిగార్డెన్ కింద ఆకుకూరలు పెంచి బాలసదనంలోని పిల్లలకు పోషకాహారంగా అందించాలని ఐసీడీఎస్ పీడీ హేనసుజన్ అన్నారు. ఒంగోలులోని బాలసదనం, శిశుగృహను శుక్రవారం సందర్శించి అక్కడ పనిచేస్తున్న అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా పీడీ హేనసుజన్ మాట్లాడుతూ దత్తత పక్రియ వేగంగా ఉండాలని సూచించారు. శిశుగృహలోని పిల్లలకు చలికాలంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పిల్లలకు ఏమైనా ఆరోగ్యం బాగా లేకపోతే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి వారిని చూపించాలని, పిల్లల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని, ఆడపిల్లలకి నెలకొకసారి బుతుక్రమంకు సంబంధించి శానిటరీ ఫాడ్‌లు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాలల సంరక్షణ అధికారి పి.దినేష్‌కుమార్, బాలసదనం సూపరింటెండెంట్ డి.జీవిత, సిబ్బంది పాల్గొన్నారు.
ఐసీడీఎస్ పీడీ హేన సుజన్
Comments
Please login to add a commentAdd a comment