నూతన జీవనోపాధులతో అభివృద్ధి సాధ్యం
ఒంగోలు వన్‌టౌన్: పీఎం అజయ్ (ప్రధాన మంత్రి అనుసుచిత్ జాతి అభ్యుదయ యోజన) పథకం ద్వారా నూతన జీవనోపాధులను ఏర్పాటు చేసుకోవాలని ఉన్నతి రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ జి. రాజా ప్రతాప్ అన్నారు. ఒంగోలులోని టీటీడీసీ కార్యాలయంలో పీఎం అజయ్ రుణాలు పొందేందుకు అర్హులైన 109 మంది లబ్ధిదారులకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సెర్ప్ ఉన్నతి పీడీ మాట్లాడుతూ సెర్ప్ ఉన్నతి విభాగం, ఎస్సీ కార్పొరేషన్‌లు ఈ పథకాన్ని సంయుక్తంగా అమలు చేస్తున్నాయన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గరిష్టంగా రూ. 50 వేల సబ్సిడీ, సెర్ప్ ఉన్నతి తరఫున వడ్డీలేని రుణం, లబ్ధిదారుని వాటా, ఇన్సూరెన్సు కలిపి యూనిట్ విలువ లక్ష రూపాయల నుంచి మూడు లక్షల వరకు ఉంటుందన్నారు. 37 మండలాల నుంచి 109 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. వీరికి సుస్థిర జీవనోపాధుల ఏర్పాటు, ముడి సరుకు లభ్యత, నైపుణ్య అభివృద్ధి, మార్కెటింగ్ సౌలభ్యత, రుణం చెల్లింపులుపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ టి. రవికుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి రవితేజ యాదవ్, జేడీఎం డి. రజనీ కాంత్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment