– సాక్షి, ఒంగోలు
భూముల మార్కెట్ వాల్యూ రివిజన్‌కు అభ్యంతరాల స్వీకరణ
ఒంగోలు అర్బన్: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని భూములు, ఇళ్ల స్థలాల విలువల్లో మార్పులు, చేర్పులు చేసేందుకు జిల్లా మార్కెట్ వాల్యూ రివిజన్ కమిటీ చైర్మన్ జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాల కృష్ణ ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు భూములు, ఇళ్లస్థలాల విలువల్లో మార్పులు, చేర్పులు చేయటానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తూ ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు. జిల్లా మార్కెట్ వాల్యూ రివిజన్ కమిటీ జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన పలు మార్లు సమావేశాలు నిర్వహించి ప్రతిపాదనలు రూపొందించామన్నారు. అందులో భాగంగా తాత్కాలికంగా ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖకు చెందిన కమిషనర్, ఇన్‌స్పెక్టర్ జనరల్ సర్క్యులర్ నంబర్ ఎంవీ/752/2022 తేదీ 31/12/2024 ఉత్తర్వుల ప్రకారం తాత్కాలిక ఆమోదం తెలిపామన్నారు. తాత్కాలికంగా భూములు, ఇళ్ల స్థలాల విలువల్లో మార్పులు, చేర్పులు చేయటానికి ఆమోదం పొందిన ప్రతిపాదనలపై ప్రజల నుంచి ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తారన్నారు. అందుకోసం ఈ నెల 24వ తేదీ వరకు గడువు ఇచ్చినట్లు పేర్కొన్నారు. తాత్కాలిక మార్కెట్ వాల్యూ ప్రతిపాదనలకు సంబంధించి ఐజీఆర్‌ఎస్ వెబ్‌సైట్‌లో, సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో, మండల తహశీల్దార్ కార్యాలయాల్లో, మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలతో పాటు కలెక్టర్ కార్యాలయం కూడా నోటీసు బోర్డుల్లో ప్రజల అభ్యంతరాల కోసం ఉంచారన్నారు. సదరు మార్కెట్ వాల్యూ ప్రతిపాదనలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత సబ్ రిజిస్ట్రార్‌కు స్వయంగా కానీ, పోస్టు ద్వారా కానీ లేదా ఐజీఆర్‌ఎస్ వెబ్‌సైట్ ద్వారా కానీ ప్రజలు అభ్యంతరాలను వెలిబుచ్చవచ్చని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment