బీసీల సమస్యల పరిష్కారానికి కులగణనే కీలకం
మార్కాపురం: బీసీల సమస్యల పరిష్కారానికి కులగణనే కీలకం కానుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే శంకరరావు అన్నారు. మార్కాపురం ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానం మేరకు రాష్ట్ర స్థాయిలో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలన్నా, జాతీయ స్థాయిలో రోహిణీ కమిషన్ సిఫార్సుల మేరకు ఓబీసీల వర్గీకరణ జరపాలన్నా కులగణన చేయాల్సిందేనన్నారు. కేంద్రంలో ప్రత్యేకంగా ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి సబ్‌ప్లాన్ మేరకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కులగణన విషయంలో తాత్సారం చేయడం తగదన్నారు. గతంలో మోదీతోపాటు అమీత్‌షా, రాజ్ నాథ్ సింగ్‌లు జనగణనతోపాటు కులగణన కూడా ప్రత్యేక ఫార్మెట్ చేయిస్తానని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడు కే క్రాంతి కుమార్, మార్కాపురం గౌడ సంఘం అధ్యక్షుడు గజా రమణ, గౌడ భవన్ చైర్మన్ ఇల్లూరి రంగస్వామి, రంగ నాయకులు, కాశయ్య, రంగారావు, బత్తిన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment