నవోదయ ప్రవేశ పరీక్షకు 7,184 మంది హాజరు
ఒంగోలు సిటీ: జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయంలో 2025–2026 విద్యాసంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశించేందుకు శనివారం నిర్వహించిన పరీక్షకు 7,184 మంది హాజరైనట్లు డీఈఓ అత్తోట కిరణ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష మొత్తం 25 సెంటర్లలో నిర్వహించారన్నారు. మొత్తం 13,765 మంది విద్యార్థులకు గాను, 7,184 మంది హాజరుకాగా, 6,581 మంది గైర్హజరైనట్లు చెప్పారు. మొత్తం 16 ఫ్‌లైయింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేసినట్లు డీఈఓ తెలిపారు.
నవోదయ పరీక్ష కేంద్రాలను పరిశీలించిన డీఈఓ
పొదిలి రూరల్: పొదిలిలో జరుగుతున్న జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష కేంద్రాలను శనివారం డీఈఓ కిరణకుమార్ పరిశీలించారు. పట్టణంలోని మూడు పరీక్ష కేంద్రాల్లో 887 మంది విద్యార్థులకు గాను 426 మంది హాజరయ్యారు. 461 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలు ప్రశాతంగా జరిగాయి. అనంతరం ఎంఈఓ కార్యాలయంలో జీవో 117 రద్దు పై కనిగిరి డివిజన్ ఎంఈఓలు, కాంప్లెక్స్ చైర్మన్లకు నిర్వహించిన సమావేశంలో డీఈవో మాట్లాడారు. ఈనెల 23న కమిషనర్ ఒంగోలు వస్తుండడంతో 21, 22 తేదీల్లో కమిటీలు స్కూల్‌ను పరిశీలించి నివేదికలు తయారు చేయాలన్నారు. 1, 2 తరగతులను అంగన్‌వాడీ ఫౌండేషన్, బేసిక్ ప్రైమరీ స్కూల్, 60 మంది కంటే పిల్లలు ఎక్కువ ఉంటే మోడల్ స్కూల్‌గా, 30 మంది కంటే తక్కువగా ఉన్న స్కూలును గుర్తించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment