బ్రిటీష్ వరల్డ్ రికార్డుల్లో కందేపి
సిరిసిల్లటౌన్: బాలసాహితీవేత్త డాక్టర్ కందేపి రాణిప్రసాద్‌కు బ్రిటీష్ వరల్డ్ రికార్డుల్లో చోటు లభించింది. సిరిసిల్లలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మానవ శరీర అవయవాలు, బాలసాహిత్యం, ఆస్పత్రి పరికరాల తయారీ, వ్యర్థాలతో అందమైన ఆకృతుల తయారీ తదితర అంశాలతో ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నందుకు ఈ గౌరవం తనకు దక్కిందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా పలువురు అభినందించారు.
దాడి సంఘటనలో ఇద్దరిపై కేసు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఒకరిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి గాయపర్చగా.. బాధితుడి ఫిర్యాదుతో ఇద్దరిపై కేసు నమోదు చేశామని ఎస్సై రమాకాంత్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు. మండల కేంద్రంలోని వడ్డెరకాలనీకి చెందిన శివరాత్రి పరశురాములు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బుధవారం అర్ధరాత్రి సుమారు ఒంటిగంట ప్రాంతంలో డీజే సౌండ్ పెట్టి డాన్సులు చేస్తున్నారు. శివరాత్రి నరేశ్, అతని తండ్రి రాజు కలిసి దాడి చేశారు. ఈ దాడిలో పరశురాములు తలకు తీవ్రగాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment