సిరిసిల్లకల్చరల్: ప్రభుత్వ భూముల కబ్జాలకు సహకరించిన జిల్లాలోని రెవెన్యూ అధికారులను శిక్షించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు కోరారు. పార్టీ ఆఫీస్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. తంగళ్లపల్లి మండలంలో గత ప్రభుత్వ పెద్దల అండదండలతో విలువైన ప్రభుత్వ భూములు పట్టాలు చేయించుకున్న వైనంలో రెవెన్యూ అధికారులు సైతం లక్షల్లో దండుకుని అనర్హులకు పట్టాలు చేశారని ఆరోపించారు. తంగళ్లపల్లి మండలంలోనే కనీసం వెయ్యి ఎకరాలు కబ్జాకు గురయ్యాయన్నారు. సీబీఐ విచారణ చేపట్టాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment