గణతంత్ర వేడుకలకు సిద్ధం
సిరిసిల్ల: గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పకడ్బందీగా చేశామని అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ తెలిపారు. పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో ఆదివారం నిర్వహించే వేడుకల ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. వేదికతోపాటు ప్రొటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు, సౌండ్‌సిస్టం, స్వాతంత్య్ర సమరయోధులకు అధికారులకు, సిబ్బందికి, ప్రజలకు అవసరమైన కుర్చీలు, తాగునీటి సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు. ఉదయం 9 గంటలకు కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించి జాతీయపతాకాన్ని ఆవిష్కరిస్తారని, 9.10 గంటలకు కలెక్టర్ సందేశం, 9.20 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, 9.50 గంటలకు విధులలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు పంపిణీ ఉంటుందని వివరించారు. సిరిసిల్ల ఇన్‌చార్జి ఆర్డీవో రాధాబాయి, మున్సిపల్ కమిషనర్ లావణ్య, డీపీఆర్వో శ్రీధర్ సిరిసిల్ల తహసీల్దార్ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment