పల్లెల నుంచి సైన్యంలోకి..
పెద్దపల్లిరూరల్/ఇల్లంతకుంట/మల్యాల/ బోయినపల్లి: పల్లె యువత సైన్యంలో చేరేందుకు ముందుకు వస్తున్నారు. సరిహద్దుల్లో పహారా కాస్తూ దేశ రక్షణ కోసం ఎంతటి త్యాగానికై నా సిద్ధపడుతున్నారు. పెద్దపల్లి మండలంలోని మారెడుగొండ, బ్రాహ్మణపల్లి నుంచి దాదాపు 40 మంది యువకులు సైన్య ంలో ఆర్మీ, సీఆర్‌పీఎఫ్, తదితర విభాగాల్లో పని చేస్తున్నారు. బ్రాహ్మణపల్లికి చెందిన మేకల విజయ్‌కుమార్ మాజీ సైనికుల సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట నుంచి ఏడుగురు యువకులు ఆర్మీ సైనికులుగా చైనా, పాకిస్తాన్ బార్డర్‌లలో ఎముకలు కొరికే చలిలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన జెట్టి పోచయ్య, ఎండీ.జైనుద్దీన్ మొదటగా ఆర్మీలో సేవలందించారు. మల్యాల, బోయినపల్లి మండలాల నుంచి కూడా పలువురు యువకులు సైన్యంలో సేవలందిస్తున్నారు. మల్కాపూర్‌కు చెందిన పబ్బాల అనిల్ 2023 మే 4న జమ్మూకశ్మీర్‌లోని నదీలో హెలికాప్టర్ పడిపోయిన ప్రమాదంలో మృతిచెందాడు. ఈ నెల 14న పుణేలో జరిగిన భారత సైనిక దినోత్సవంలో మరణానంతర సేవా మెడల్‌ను అనిల్ సతీమణి సౌజన్యకు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment