జమ్మికుంటలో నిత్య జనగణమన
● కార్యక్రమ రూపకర్త అప్పటి సీఐ ప్రశాంత్‌రెడ్డి ● ఆదర్శంగా పలు రాష్ట్రాల్లో నిర్వహణ
జమ్మికుంట(హుజూరాబాద్): జమ్మికుంట పట్టణంలో 2017 ఆగస్టు 15న ప్రారంభమైన నిత్య జనగణమన కార్యక్రమం ఎనిమిదేళ్లుగా కొనసాగుతోంది. నిత్యం ఉదయం 7 గంటల 52 నిమిషాలకు ప్రధాన కూడళ్లతోపాటు గాంధీచౌక్ వద్ద ప్రజలు జాతీయ గీతం పాడుతున్నారు. ఉరుకుల పరుగుల జీవనంలో ప్రజల్లో దేశభక్తి పెంపొందించే లక్ష్యంతో అప్పటి సీఐ, ప్రస్తుత ఏసీపీ సైబర్ క్రైం బ్యూరో హైదరాబాద్ పింగిళి ప్రశాంత్‌రెడ్డి దేశంలోనే తొలిసారి నిత్య జనగణమనకు ఇక్కడ రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని, దేశంలోని కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, హరియాణా, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు. నిత్య జనగణమన ఒక పండుగ రూపం దాల్చాలని బలంగా కోరుకున్నాను. నా కల నెరవేరినందుకు సంతోషంగా ఉందని ఏసీపీ తెలిపారు. జమ్మికుంట మున్సి పల్ అధికారులు, ప్రభుత్వం చొరవ తీసుకొని, నిత్యజనగణమన కార్యక్రమానికి కావాల్సిన వసతులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment