1950నాటి నాణెం.. అంబేడ్కర్ స్టాంపులు
సిరిసిల్లటౌన్: సిరిసిల్లకు చెందిన కొత్వాల సాయిరాం చిన్నప్పటి నుంచే దేశ స్వాంతంత్య్రోద్యమ పోరాట కథలు చదివా డు. వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలకు సంబంధించిన క్లిప్పింగులు సేకరించడం అలవాటుగా మార్చుకున్నాడు. ఏటా జనవరి 26, ఆగస్టు 15, అక్టోబర్ 2వ తేదీల్లో వాటిని ప్రదర్శిస్తున్నాడు. ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా తాను సేకరించిన నాణేలు, పోస్టల్ స్టాంపులను ప్రదర్శించాడు. 1950లో భారత రాజ్యాంగం అమలైన సందర్భంగా ముద్రించిన రూపాయి నాణెం, వివిధ దశల్లో రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ ఫొటోతో ముద్రించిన స్టాంపులను సేకరించాడు. వాటిని చూసిన పలువురు సాయిరాంను అభినందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment