పెళ్లోయి | - | Sakshi
Sakshi News home page

పెళ్లోయి

Published Sun, Oct 27 2024 11:37 AM | Last Updated on Sun, Oct 27 2024 11:37 AM

పెళ్ల

పెళ్లోయి

రూపాయి..
నిరుపేద జంటలకు చేయూత
● దాతల నుంచి సహకారం ● కేవలం రూపాయితో వివాహం ● పండితుల నుంచి బంధువుల భోజనాల ఖర్చు వరకు .. ● ఆదర్శంగా నిలుస్తున్న ‘రూపాయి ఫౌండేషన్‌’

అలా మొదలైంది..

నాకు స్క్రీన్‌ ప్రింటింగ్‌ దుకాణం ఉండేది. ఒక అడ్వకేట్‌కి విజిటింగ్‌ కార్డులు ముద్రించి ఇచ్చేందుకు ఇంటికి వెళ్లాను. అక్కడ ఓ పేద విద్యార్థి వార్షిక ఫీజు చెల్లించలేని స్థితిలో కనిపించాడు. ఓ మంచి పని చేయాలని నాకు న్యాయవాది సూచించాడు. వెంటనే ఆ విద్యార్థి ఫీజు చెల్లించా. ఆ తర్వాత పేదలను ఆదుకోవాలని నిర్ణయించుకున్నా. తొలుత అమ్మ ఫౌండేషన్‌, ఆ తర్వాత రూపాయి ఫౌండేషన్‌ ఏర్పాటు చేశాం. మేం చేస్తున్న సేవలు చూసి దాతలు ముందుకు వచ్చారు. ఎవరికి తోచిన సాయం వారు చేస్తున్నారు.

– అనిల్‌కుమార్‌గుప్తా, సరూర్‌నగర్‌

పెళ్లి పందిళ్లు వేస్తా

రూపాయి ఫౌండేషన్‌ ద్వారా ఉచితంగా నిర్వహించే వివాహ, ఇతర శుభ కార్యాలకు నా వంతుగా సేవలు అందిస్తున్నా. పైసా తీసుకోకుండా పెళ్లి పందిరిని సిద్ధం చేస్తున్నా. పేద, మధ్య తరగతి వర్గాలకు చేయూతను అందించాలనేది నా తపన.

– లక్ష్మణ్‌, డెకరేషన్‌ దాత

ఘనంగా పెళ్లి జరిపించారు

అమ్మ ఉన్నా మా జీవితాలు అంతంత మాత్రమే. నాన్న బతికిఉన్నా ఇంత మంచిగా పెళ్లి చేసే వారు కాదు. రూపాయితో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నా. పెళ్లి బట్టలు, బంగారు తాళి, వెండి మెట్టెలతో పాటు వంట పాత్రలు అందజేశారు. బందుమిత్రులకు భోజనాలు సమకూర్చారు. ఘనంగా వివాహం జరిపించారు. నా భర్త మెకానిక్‌ షాప్‌లో పని చేస్తున్నాడు. ఈ వివాహ వేడుక మా ఇద్దరికీ ఎంతో ఆనందంగా ఉంది. రూపాయి పెళ్లి దాతలకు కృతజ్ఞతలు. జీవితాంతం రుణపడి ఉంటాం.

– నాగలక్ష్మి, మలక్‌పేట

ర్చులు భరించే స్థోమత లేని అనాధలు, దివ్యాంగులు, పేద వధూ వరులను కేవలం ఒక్క రూపాయితో ఒక్కటి చేస్తోంది సరూర్‌నగర్‌ డివిజన్‌లోని శారదనగర్‌ కాలనీకి చెందిన రూపాయి ఫౌండేషన్‌. ఎంతో మందిని ఒక్కటి చేసి ఆదర్శంగా నిలుస్తోంది. సరూర్‌నగర్‌కు చెందిన నాగమళ్ల అనిల్‌, అరుణ దంపతులు. పేదలకు తమవంతు చేయూతను అందించాలనే ఆలోచనతో 2007లో ‘అమ్మ ఫౌండేషన్‌’కు అంకురార్పణ చేశారు. ఆర్థికంగా వెనుకబడిన పేదలు, దివ్యాంగులు, అనాధ జంటలకు వివాహం చేసి ఒక్కటి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళసూత్రాలు, మెట్టెలు, నూతన వస్త్రాలు సమకూర్చడం మొదలు పెళ్లికి ఆసీనులయ్యే బంధు మిత్రులకు భోజనాలు వడ్డించే వరకు ఖర్చు భరిస్తున్నారు. పెళ్లిళ్లే కాదు.. సామూహిక సీమంతాలు, నామకరణాలు కూడా చేస్తున్నారు.

ఒక్కటైన జంటలెన్నో..

పెరిగిన ఖర్చుల నేపథ్యంలో వివాహాలను జరిపించడం ఫౌండేషన్‌కు భారంగా మారింది. దాతల సహకారం కోసం ఈ ఏడాది జనవరి 2న ‘రూపాయి’ పేరుతో మరో ఫౌండేషన్‌ ప్రారంభించారు. ఒక్కో దాత నుంచి రూపాయి చొప్పున సేకరించి, వచ్చిన మొత్తాన్ని పేద జంటల పెళ్లి ఖర్చులకు ఉపయోగిస్తున్నారు. ఈ ఫౌండేషన్‌లో దాతలే సభ్యులుగా ఉన్నారు. ఒకరు డెకరేషన్‌, మరొకరు సన్నాయి, ఇంకొకరు పుస్తెమెట్టెలు.. భోజనాలు ఇలా ఎవరికి తోచిన సహకారం వారు చేస్తున్నారు. ఇప్పటి వరకు 108 జంటలను ఒక్కటి చేశారు. నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు.

ఎలా సంప్రదించాలంటే..

రూపాయి వివాహాల కోసం నిర్వాహకుడు అనిల్‌కుమార్‌గుప్తాను 92465 76070 నంబర్‌లో సంప్రదించాలి. అనాధలు, దివ్యాంగులు, నిరుపేదలు ఎవరైనా కులమతాలకు అతీతంగా సంప్రదించవచ్చు. ఇందుకు ఆన్‌లైన్‌లో రూపాయి చెల్లించి రిజస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం సమాచారం ఇచ్చి సుమూహర్తంలో వివాహం జరిపిస్తారు.

పెళ్లి అనగానే ఖరీదైన బంగారు ఆభరణాలు.. ఆ‘కట్టుకునే’ నూతన వస్త్రాలు.. విలాసవంతమైన ఫంక్షన్‌ హాళ్లు.. భారీ డెకరేషన్లు.. సంగీత్‌లు.. మంగళస్నానాలు.. సినిమా షూటింగ్‌ను తలదన్నే ఫొటో షూట్‌ సెట్టింగ్‌లు.. ఆడంబరంగా బరాత్‌లు.. తీరొక్క రుచులతో పసందైన విందు భోజనాలు.. రిటర్న్‌ గిఫ్ట్‌లు.. బంధు‘ఘనం’ సందడి.. ఇవే గుర్తుకువస్తాయి కదూ.. స్థోమతను బట్టి ఎవరికి వారు ఖర్చుకు వెనకాడకుండా చేసుకునే మహా సంబరం. మరి ఆర్థిక స్థోమత లేని వారి పరిస్థితి ఏమిటి..? అలాంటి వారి కోసమే మేమున్నాం అంటోంది ‘రూపాయి ఫౌండేషన్‌’.. ఒకే ఒక్కరూ పాయితో జంటలను ఏకం చేస్తోంది.

– హుడాకాంప్లెక్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
పెళ్లోయి1
1/6

పెళ్లోయి

పెళ్లోయి2
2/6

పెళ్లోయి

పెళ్లోయి3
3/6

పెళ్లోయి

పెళ్లోయి4
4/6

పెళ్లోయి

పెళ్లోయి5
5/6

పెళ్లోయి

పెళ్లోయి6
6/6

పెళ్లోయి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement