పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
కడ్తాల్: ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎన్ఆర్ఎల్ఎం బృందం సభ్యులు డాక్టర్ సౌందరా పాండ్యన్, డాక్టర్ భక్తవత్సల పెరుమాళ్ అన్నారు. మండల పరిధిలోని చల్లంపల్లి, కర్కల్పహాడ్, గానుగుమార్లతండాల్లో శుక్రవారం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జాతీయ గ్రామీణా ఉపాధిహమీ పథకం కింద చేపట్టిన పనులను పరిశీలించారు. ఆయా గ్రామాల్లో మహిళా సంఘాల పనితీరు, వివిధ రకాల పింఛన్ల పంపిణీ గురించి అడిగి తెలుసుకున్నారు. మహిళా సంఘాల ద్వారా రుణాలు తీసుకుని, స్వయం ఉపాధి పొందుతున్న మహిళలను కలిసి వివరాలు తెలుసుకున్నారు. ఆయా గ్రామ పంచాయతీల్లో గ్రామస్తులతో సమావేశమై గ్రామాల అభివృద్ధి వివరాలు సేకరించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ అధికారులు కరుణశ్రీ, స్వేత, ఎంపీడీవో సుజాత, ఈజీఎస్ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment