‘ఇస్తేమా’కు ఏర్పాట్లు చేయండి
శంకర్‌పల్లి: పట్టణంలో వచ్చేనెల 3,4,5 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించే ‘ఇస్తేమా’ కార్యక్రమం కోసం అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. శంకర్‌పల్లిలో ఇస్తేమా జరిగే ప్రదేశాన్ని మంగళవారం ఆయన స్థానిక ఎమ్యెల్యే కాలే యాదయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మితో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులు, పోలీసులు, ముస్లిం పెద్దలతో ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇస్తేమా కోసం రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల్లో ముస్లింలు వస్తారని, దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. మూడు రోజుల పాటు ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తామని, చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ మానిటరింగ్ చేస్తారని తెలిపారు. విద్యుత్, మిషన్ భగీరథ, ఆర్‌డబ్ల్యూఎస్, మున్సిపల్, పంచాయతీరాజ్, రెవెన్యూ, రోడ్లుభవనాలు, పోలీసు అన్ని విభాగాలు సమన్వయం చేసుకోవాలన్నారు. పనులకు సంబంధించిన అంచనాల నివేదికలను అందిస్తే నిధులు మంజూరు చేస్తామని వెల్లడించారు. ఈనెల 25వ తేదీలోపు ఏరాట్లు పూర్తి చేసి, 31వ తేదీ వరకు ట్రయల్ ప్రారంభించాలని ఆదేశించారు. ఈనెల 25 తర్వాత మళ్లీ వచ్చి పరిశీలించనున్నట్టు చెప్పారు. సమావేశంలో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రెసిడెంట్ ఫహీయుద్దీన్ ఖురేషి తదితరులు పాల్గొన్నారు.
అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment