సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలు పట్టవా?
ఇబ్రహీంపట్నం రూరల్: సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. కొద్ది రోజులుగా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్షా ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం 11వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. అనంతరం నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. సమగ్ర శిక్షా ఉద్యోగుల న్యాయమైన కోరికలను తీర్చాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇస్తున్న నిధులతోనే నెట్టుకొస్తోందని, నయపైసా కూడా ఖర్చు చేయడం లేదని విమర్శించారు. సమగ్ర శిక్షా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పొట్టి రాములు, మీడియా సెల్ కన్వీనర్ ఉడుతల అశోక్‌గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీఎస్‌యూటీఎఫ్ సంఘీభావం
సమగ్ర శిక్షా ఉద్యోగులకు టీఎస్‌యూటీఎఫ్ సంఘీభావం తెలిపింది. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోపాల్ నాయక్, వెంకటప్ప మాట్లాడుతూ.. ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకోవాలని కోరారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి కిషన్‌నాయక్ పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment