వీధి కుక్కల నుంచి కాపాడండి
షాద్‌నగర్‌రూరల్: వీధి కుక్కల బారి నుండి తమను కాపాడాలని కోరుతూ ఇద్దరు చిన్నారులు సోమవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మున్సిపల్ కమిషనర్ వెంకన్నకు సామాజిక మాధ్యమాల ద్వారా విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని మల్లికార్జున కాలనీకి చెందిన రమ్య గాయత్రీ, రవళి పాఠశాలకు వెళ్లే సమయంలో ఇంటి ముందుకు వచ్చిన వీధి కక్కులను చూసి భయపడ్డారు. ఈ సందర్భంగా వీధి కుక్కల నుంచి కాపాడాలని ఎమ్మెల్యే, కమిషనర్‌ను కోరుతూ చిన్నారులు దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే మున్సిపల్ కమిషనర్ వెంకన్నతో మాట్లాడారు. వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కుక్కల నివారణకు చర్యలు చేపట్టామని, పపట్టణ శివారులోని బొబ్బిలి చెరువు సమీపంలో కుక్కల సంతాన నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.
చిన్నారుల విన్నపం
సామాజిక మాధ్యమాల్లో వైరల్
స్పందించిన షాద్‌నగర్ ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment