అంకితభావంతో పని చేయాలి
షాద్‌నగర్ ఏసీపీ రంగస్వామి
ఆమనగల్లు: పోలీసు అధికారులు, సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తించాలని షాద్‌నగర్ ఏసీపీ ఎన్‌సీహెచ్ రంగస్వామి సూచించారు. తలకొండపల్లి మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్‌ను సోమవారం ఆయన తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్ పరిసరాలు, స్టేషన్ రికార్డులను ఆయన పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. చోరీలు జరగకుండా అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. సైబర్‌నేరాలపై అవగాహనకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. ఏసీపీ వెంట ఆమనగల్లు సీఐ ప్రమోద్‌కుమార్, కడ్తల్ సీఐ శివప్రసాద్, తలకొండపల్లి ఎస్‌ఐ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment