విద్యార్థిని అనుమానాస్పద మృతి
ఇబ్రహీంపట్నం రూరల్: ఓ ప్రైవేటు కళాశాలలో ఉంటూ నీట్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ రాఘవేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా, పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన మైలపాకం అర్జున్ కూతురు సోని(19).. ఆదిబట్లలో అగస్త్య జూనియర్ కళాశాల హాస్టల్‌లో ఉంటూ.. నీట్ కోచింగ్ తీసుకుంటోంది. ఈనెల 4న జ్వరం రావడంతో ఆమెను మన్నెగూడలోని మహోనియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు చెప్పగా.. వైద్య ఖర్చులకు రూ.వెయ్యి ఫోన్ పే చేశారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు కడుపు నొప్పి రావడంతో వైద్యం చేయించారు. 5న అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మరోసారి కడుపునొప్పి రావడంతో అదే ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో నగరంలోని య శోద ఆస్పత్రికి తరలించా రు. అప్పటికే సోని మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉండగా.. అప్పుడప్పుడు సోనికి మైగ్రేన్ వస్తుండేదని, ఆమె మృతిపై సరైన విచారణ జరపాలని యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కళాశాల యాజమాన్యంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
రూ.12 లక్షల పరిహారం..?
యువతి మృతిపై తల్లిదండ్రులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళన చేయడంతో రాత్రికి రాత్రే రూ.12 లక్షల నష్టపరిహారం చెల్లించినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం నాయకులు కళాశాల యాజమాన్యాన్ని వివరణ కోరగా.. ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో వారు పూలకుండీలు, కుర్చీలు ధ్వంసం చేయగా.. వారిపై యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పూర్తిస్థాయి విచారణకు తల్లిదండ్రుల డిమాండ్
కేసు నమోదు చేసిన ఆదిబట్ల పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment