ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
బడంగ్‌పేట్: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందజేస్తామని ప్రభుత్వ చీఫ్‌విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిలో అందరం భాగస్వాములం అవుదామన్నారు. కార్పొరేషన్‌లో సుమారు రూ.45 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు గురువారం ఆయన శంకుస్థాపనలు చేశారు. చారిత్రక బట్టేల్‌గుట్ట పార్కును(కోట బురుజు) ప్రారంభించారు. కార్యక్రమంలో మేయర్ చిగురింత పారిజాత, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, కమిషనర్‌సరస్వతి, కార్పొరేటర్లు, మహిళలు, సిబ్బంది ఉన్నారు.
హాజరు కాని నేతలు
అభివృద్ధి పనుల శంకుస్థాపనకు జిల్లా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును ఆహ్వానించారు. ఆయనతో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ రావలసి ఉంది. ఆనివార్య కారణాల వలన వీరిద్దరూ రాలేదు. కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గం ఇన్‌చార్జి కేఎల్‌ఆర్ సైతం రాకపోవడంపై పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు.
ఎమ్మెల్యేకు దక్కని గౌరవం
శిలా ఫలకాల్లో ఎమ్మెల్యే సబితారెడ్డిని తక్కువ చేసి అగౌర పరిచారని బీఆర్‌ఎస్ కార్పొరేటర్ లిక్కి మమత ఆరోపించారు. నియోజకవర్గం ఎమ్మెల్యే పేరును ఎమ్మెల్సీల కింద ఎలా పెడతారని ప్రశ్నించారు. శంకుస్థాపనల విషయంలో స్థానిక ఎమ్మెల్యేనే ప్రారంభ సభాధ్యక్షులుగా ఉంటారని, అధికార పార్టీలో లేరని ప్రొటోకాల్ పాటించకుండా ఎలా శిలాఫలకాలు వేయిస్తారన్నారు. రూ.2.50 కోట్లతో అభివృద్ధి చేసిన చారిత్రక బట్టేల్‌గుట్ట పార్కును సబితారెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడే ప్రారంభించారని గుర్తుచేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ చేత రెండోసారి ప్రారంభించడాన్ని తప్పుపట్టారు. ప్రస్తుతం శంకుస్థాపనలు చేసిన పనులు.. వాస్తవంగా అయిపోయినవేనని పేర్కొన్నారు. కార్పొరేటర్లకు సమాచారం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
చీఫ్‌విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి
రూ.45 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
Comments
Please login to add a commentAdd a comment