తాళం వేసిన ఇళ్లు, ఆలయాలే టార్గెట్
షాద్‌నగర్‌రూరల్: తాళం వేసిన ఇళ్లు, దేవాలయాలే అతడి టార్గెట్. తాళం వేసి ఉంటే చాలు కన్నం వేస్తుంటాడు. ఆలయాల్లో హుండీ పగులగొట్టి చోరీలకు పాల్పడుతుంటాడు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. పట్టణ సీఐ విజయ్‌కుమార్ గురువారం వివరాలను వెల్లడించారు. నందిగామ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన కొనిరెడ్డి వంశీ తాళం వేసిన ఇల్లు, దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 14న పట్టణంలోని రైతు కాలనీ కోటమైసమ్మ దేవాలయంలో హుండీని పగుటగొట్టి నగదును ఎత్తుకెళ్లాడు. 15న ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి విఠల్‌రావు పరిస్థితిని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు. సాంకేతిక ఆధారాలతోహుండీ దొంగతనానికి పాల్పడింది వంశీ అని గుర్తించారు. అనంతరం తమదైన శైలిలో విచారించగా.. నేరం ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడి నుంచి ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తిపై నందిగామ, కొత్తూరు, కడ్తాల్, తలకొండపల్లి, శంషాబాద్, మహేశ్వరం, షాబాద్, కల్వకుర్తి, వెల్దండ, మూసాపేట్, జడ్చర్ల పోలిస్‌స్టేషన్లలో మొత్తం 24 కేసులు నమోదు అయినట్లు సీఐ తెలిపారు. శంషాబాద్ డీసీపీ రాజేష్, అడిషనల్ డీసీపీ రాంకుమార్,క్రైం ఏసీపీ శశాంక్‌రెడ్డి, షాద్‌నగర్ ఏసీపీ రంగస్వామి పర్యవేక్షణలో పట్టణ సీఐ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో విచారణాధికారి డీఐ వెంకటేశ్వర్లు, డీఎస్‌ఐ శరత్‌కుమార్, క్రైం టీం మోహన్, కరుణాకర్, జాకీర్, రఫీ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించారు. కేసు విచారణలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందికి ఉన్నతాధికారులతో రివార్డులను ఇప్పిస్తామని సీఐ వెల్లడించారు.
దోపిడీలకు పాల్పడుతున్న
వ్యక్తి అరెస్టు, రిమాండ్
వివరాలు వెల్లడించిన
పట్టణ సీఐ విజయ్‌కుమార్
నిందితుడిపై 24 కేసులు ఉన్నట్లు గుర్తింపు
Comments
Please login to add a commentAdd a comment