పర్యావరణ పరిరక్షణపై అవగాహన ఉండాలి
కడ్తాల్: పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించాలని సెంట్రల్ ఫర్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్( సీసీఆర్‌టీ న్యూ ఢిల్లీ) మాజీ డైరెక్టర్ గిరీశ్‌జోషి అన్నారు. కౌన్సిల్‌ఫర్ గ్రీన్ రెవల్యూషన్, సీసీఆర్‌టీ, డీఆర్‌పీ సంయుక్త ఆధ్వర్యంలో ఎర్త్ అండ్ కల్చర్ అంశంపై ఏర్పాటు చేసిన జాతీయ విద్యా సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని అన్మాస్‌పల్లి ఎర్త్ సెంటర్‌లో గురువారం నిర్వహించిన కార్యక్రమానికి రిటైర్డ్ ప్రొఫెసర్ ఎన్.ఉపేందర్‌రెడ్డితో పాటు, 16 రాష్ట్రాలకు చెందిన 60 మంది డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్లు హాజరయ్యారు. అనంతరం ఎర్త్ సెంటర్‌లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సీజీఆర్ చైర్ పర్సన్ లీలాలక్ష్మారెడ్డి, పర్యావరణ శాస్త్రవేత్తలు డాక్టర్ ఉమామహేశ్వర్‌రెడ్డి, డాక్టర్ సాయిభాస్కర్‌రెడ్డి, డీఆర్పీలు గన్నారం ప్రభాకర్, పంజ రాజమల్లు, వెంకటేశ్వరరావు,నాగరాజు, సీజీఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment