విద్యాభివృద్ధికి పాటుపడటం హర్షణీయం
షాద్‌నగర్: విద్యారంగ అభివృద్ధికి పాటుపడితే.. చిరస్థాయిగా గుర్తిండిపోతారని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో షాద్‌నగర్ పట్టణంలో దాతల సహకారంతో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రొఫెసర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్య పూర్తిగా వెనుకబడిందన్నారు. ప్రస్తుతం పేదవాళ్లు మాత్రమే సర్కారు బడులు, కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారని పేర్కొన్నారు. సంపన్నులు, డబ్బులు ఉన్న వారు ప్రైవేటు విద్యాసంస్థలకు వెళ్తున్నారని తెలిపారు. సర్కారు బడుల్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో పేద విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలను.. దాతల సహకారంతో ఎమ్మెల్యే నిర్మిస్తుండటం హర్షణీయమన్నారు. 150 ఏళ్ల క్రితం మొగిలిగిద్దలో నిర్మించిన ప్రభుత్వ పాఠశాలలో తాను విద్యను అభ్యసించానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించే స్వర్ణోత్సవ వేడుకలకు వస్తానని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు బాబర్‌ఖాన్, కృష్ణారెడ్డి, విశ్వం, చెన్నయ్య, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, బాల్‌రాజ్‌గౌడ్, బస్వం, ఎండీ ఇబ్రహీం, ముబారక్ తదితరులు పాల్గొన్నారు.
ప్రొఫెసర్ హరగోపాల్
Comments
Please login to add a commentAdd a comment