‘సంగమేశ్వర’ పనులు ప్రారంభించాలి
అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే మాణిక్‌రావు
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ ప్రాంతానికి సాగు నీరు అందించేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించాలని ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం ఆయన మాట్లాడుతూ...జహీరాబాద్ ప్రాంతం సముద్రమట్టానికి 600 మీటర్ల ఎత్తులో ఉందని, శాశ్వత నీటి వనరులు ఇక్కడలేవన్నారు. ప్రాజెక్టులు, చెరువులు లేని కారణంగా బోరు బావులపై ఆధారపడిరైతులు పంటలు సాగుచేస్తున్నారని పేర్కొన్నారు. జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాలో ఇదే పరిస్థితి ఉందని, నియోజకవర్గానికి లక్ష ఎకరాల్లో సాగు నీరు అందించాలని మాజీ సీఎం కేసీఆర్ ఎత్తిపోతల ప్రాజెక్టులను ప్రారంభించారని గుర్తు చేశారు. ఎత్తిపోతల పథకానికి భూసేకరణ, శంకుస్థాపనలు చేశారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి వెంటనే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించి పూర్తి చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment