అంతర్జాతీయస్థాయిలో రాణించాలి
సంగారెడ్డి జోన్/సంగారెడ్డి టౌన్: విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. జిల్లాకు చెందిన అబ్దుర్ రెహమాన్, అలియా ఫాతిమా, అబ్దుల్ నజీర్ ఈ నెల 6, 7వ తేదీలలో భూపాలపల్లిలో జరిగిన 9వ తెలంగాణ వింటర్ ఇంటర్ డిస్ట్రిక్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ 2024 రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు మంగళవారం కలెక్టర్‌ను కలవగా వారిని అభినందించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో స్విమ్మింగ్ పూల్‌లో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని, విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తానని హామీనిచ్చారు.
డ్రైవింగ్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
మహిళలు డ్రైవింగ్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ క్రాంతి పేర్కొన్నారు. సంగారెడ్డి బైపాస్‌లోని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఎస్‌బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు కార్ డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కలెక్టర్ వల్లూరు క్రాంతి
Comments
Please login to add a commentAdd a comment