రాష్ట్ర స్థాయి క్రీడలకు విద్యార్థులు ఎంపిక
రెజ్లింగ్ క్రీడలో..
తొగుట(దుబ్బాక): గుడికందుల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ క్రీడలకు ఎంపిక కావడం గొప్ప విషయమని ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా కమిటీ సభ్యుడు విభీషన్ రెడ్డి అన్నారు. 19న సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన సీఎం కప్ క్రీడల్లో పాల్గొన్న గంగనిగల్ల రామ్ చరణ్, తోయేటి అజయ్ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర క్రీడలకు ఎంపికయ్యారు. జిల్లా స్థాయిలో 45, 50 కిలోల విభాగంతో పాల్గొని బంగారు పతకాలు అందుకున్నారు. శుక్రవారం పాఠశాలలో మాజీ ఉప సర్పంచ్ శ్రీకాంత్‌రెడ్డితో కలిసి విద్యార్థులకు నగదు పురస్కారం అందజేసి సన్మానించారు. అలాగే, గణిత టాలెంట్ టెస్ట్‌లో విజేతలుగా నిలిచిన ఎడ్ల కుమార్, ఎడ్ల స్రవంతిని సన్మానించి నగదు పురస్కారం అందజేశారు. పాఠశాల హెచ్‌ఎం అంజిరెడ్డి, ఉపాధ్యాయులు నా గిరెడ్డి, కనకరాములు, వేణుమాధవ్, భిక్షపతి, హనుమారెడ్డి, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
వాలీబాల్ పోటీల్లో..
కొండపాక(గజ్వేల్): కొండపాక మండలంలోని బందారం హైస్కూల్ విద్యార్థులు వాలీబాల్ పోటీల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. సిద్దిపేటలో జరుగుతున్న 2024 సీఎం కప్ క్రీడల్లో భాగంగా అండర్ 18 బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో, బాలికల విభాగంలో ద్వితీయ స్థానంలో కొండపాక జట్టు నిలిచింది. దీంతో బందారం హైస్కూల్ రాగుల దినేశ్, కిన్నెర మహేశ్, తేజలతోపాటు బాలికలు చింతల అనూష, బట్ట అక్షయ, బట్ట రాణి, కిన్నెర భవానీ రాష్ట్ర స్థాయిలో పాల్గొనేందుకు ఎంపికయ్యారని హెచ్‌ఎం రామచంద్రం పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెమోంటో అందజేస్తూ అభినందించారు. కార్యక్రమంలో పీఈటీ రాజ్‌కుమార్, ఉపాధ్యాయులు నర్సింహ్మరెడ్డి, బాల కనకయ్య, శ్రీనివాస్ రెడ్డి, భాగ్యలక్ష్మి, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
చెస్ పోటీలకు కొత్తపల్లి విద్యార్థి..
పాపన్నపేట(మెదక్): సీఎం కప్ క్రీడా పోటీల్లో భాగంగా మెదక్‌లో శుక్రవారం నిర్వహించిన చెస్ టోర్నమెంట్‌లో పాపన్నపేట మండలం కొత్తపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థి వెంకటేశ్ రాష్‌ట్రస్థాయికి ఎంపికై నట్లు పీడీ నరేశ్ తెలిపారు. హైద్రాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో 31న జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో వెంకటేశ్ పాల్గొంటాడని పేర్కొన్నారు. విద్యార్థిని హెచ్‌ఎం దత్తురెడ్డి, టీచర్లు శివకుమార్, నాగభూషణం, వేణుగోపాల్, ప్రసాద్‌రెడ్డి , తులసీరాం అభినందించారు.
సైక్లింగ్ పోటీలకు..
హుస్నాబాద్‌రూరల్: హైదరాబాద్‌లో 27న నిర్వహించే రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలకు హుస్నాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు బల్లు నిఖిల్, నేతి జశ్వంత్ ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ గంగాధర్ తెలిపారు. శుక్రవారం కళాశాలలో విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో లెక్చరర్లు బండారు ఎల్లయ్య, ఎస్‌ఎస్, రాజులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment