‘గ్యారంటీ’లతో మభ్యపెడుతున్న కాంగ్రెస్
దుబ్బాకటౌన్: కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల గారడీతో ప్రజలను మభ్యపెడుతోందని బీజేపి జిల్లా ప్రధాన కార్యదర్శి భూరెడ్డిగారి విభూషణ్ రెడ్డి విమర్శించారు. రాయపోల్‌లో ఆదివారం పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో బూత్ కమిటీలు, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన అబద్ధాల హామీలతో రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులను మోసంచేసి విజయోత్సవ సభలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రాజాగారి రాజాగౌడ్, మంకిడి స్వామి, నీల స్వామి, సుఖేందర్‌రెడ్డి తదితరులున్నారు.
బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి విభూషణ్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment