గ్రూప్ 2 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
సిద్దిపేటరూరల్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్–2 పరీక్ష కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తెలిపారు. ఈనెల 15, 16 తేదీల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో గ్రూప్–2 పరీక్ష నిర్వహణకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్, విభాగం అధికారి, రూట్ ఆఫీసర్లు, తదితర అధికారులతో సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 37 సెంటర్లలో 13,714 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారన్నారు. పరీక్ష కేంద్రం చుట్టూ 144సెక్షన్ అమలు చేస్తూ బందోబస్తు చేపట్టాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment