టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దాదాపు 6 నెలల తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమయ్యాడు. ఆసియాకప్-2023 సూపర్-4లో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరగనున్న మ్యాచ్‌తో రాహుల్ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది ఐపీఎల్ సందర్భంగా గాయపడిన రాహుల్.. అప్పటి నుంచి ఎటువంటి క్రికెట్ ఆడలేదు. ఈ క్రమంలో ఏన్సీఎలో చేరిన రాహుల్ పూర్తి ఫిట్‌నెస్ సాధించి.. ఆసియాకప్‌కు ఎంపికయ్యాడు. అయితే శ్రీలంకకు పయనమయ్యే ముందు మళ్లీ రాహుల్‌ను పాత గాయం తిరగబెట్టింది.
దీంతో అతడు ఏన్సీఏలోనే ఉండిపోయాడు. ఈ క్రమంలో అతడు టోర్నీలో తొలి రెండు లీగ్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అయితే అతడు మళ్లీ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకుని భారత జట్టుతో చేరాడు. జట్టుతో కలిసిన రాహుల్ ఇండోర్ ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నాడు. ఇక్కడ వరకు అంత బాగానే ఉన్న రాహుల్‌కు తుది జట్టులో చోటు దక్కితే ఎవరిపై వేటు వేయాలన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఎవరిపై వేటు..
రిషబ్ పంత్ జట్టుకు దూరమైనప్పటి నుంచి మెనెజ్‌మెంట్ వికెట్ కీపర్లను మారుస్తూ వస్తోంది. గతంలో కొన్ని సందర్భాల్లో పంత్ అందుబాటులోనప్పుడు కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టేవాడు. కానీ రాహుల్ కూడా గాయం కారణంగా దూరంకావడంతో వైట్‌బాల్ క్రికెట్‌లో ఇషాన్ కిషన్‌కు ఆ బాధ్యతలు జట్టు మెనెజ్‌మెంట్ అప్పగించింది.
తనకు వచ్చిన అవకాశాన్ని కిషన్ అందిపుచ్చుకున్నాడు. విండీస్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. అంతేకాకుండా ఆసియాకప్ టోర్నీలో పాకిస్తాన్‌పై టాపర్డర్ విఫలమైన చోట కిషన్ 82 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో రాహుల్ వచ్చినప్పటికీ కిషన్ స్ధానానికి ఢోకా లేదు అన్పిస్తోంది.
మరోవైపు ఈ టోర్నీతో రీఎంట్రీ ఇచ్చిన శ్రేయస్ అయ్యర్‌పై వేటుపడే సూచనలు కన్పిస్తున్నాయి. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కేవలం 14 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో అయ్యర్ స్ధానంలో రాహుల్ తుది జట్టులోకి రానున్నట్లు పలురిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఎవరిపై వేటు పడుతుందో ఆదివారం వరకు వేచి చూడాలి మరి!
చదవండి: Asia Cup 2023: పాకిస్తాన్‌తో మ్యాచ్.. టీమిండియాకు గుడ్ న్యూస్! బుమ్రా వచ్చేశాడు
Comments
Please login to add a commentAdd a comment