ఐపీఎల్‌ 2021: ఢిల్లీ క్యాపిటల్స్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌​ టై | IPL 2021: Delhi Capitals vs Sunrisers Hyderabad Live Updates, Highlights | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ 2021: ఢిల్లీ క్యాపిటల్స్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌​ టై

Published Sun, Apr 25 2021 7:12 PM | Last Updated on Sun, Apr 25 2021 11:25 PM

IPL 2021: Delhi Capitals vs Sunrisers Hyderabad Live Updates, Highlights - Sakshi

Courtesy: IPL Twitter

ఢిల్లీ క్యాపిటల్స్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ టైగా ముగిసింది.160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కేన్‌ విలియమ్సన్‌‌( 50 బంతుల్లో 65 పరుగులు, 8 ఫోర్లు) క్లాస్‌ ఇన్నింగ్స్‌ ఆడి చివరివరకు నిలిచి మ్యాచ్‌ను టై కావడంలో ప్రధానపాత్ర పోషించాడు.  ఇక చివర్లో జగదీష్‌ సుచిత్‌ 4 బంతుల్లోనే 14 పరుగులతో రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో ఆవేశ్‌ ఖాన్‌ 3, అక్షర్‌ పటేల్‌ 2, అమిత్‌ మిశ్రా ఒక వికెట్‌ తీశాడు. అంతకముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటింగ్‌లో పృథ్వీ షా 53 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. పంత్‌ 37, స్మిత్‌ 34 నాటౌట్‌ రాణించారు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో సిద్ధార్థ్‌ కౌల్‌ 2, రషీద్‌ ఖాన్‌ ఒక వికెట్‌ తీశాడు. 

ఎస్‌ఆర్‌హెచ్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. అక్షర్‌ పటేల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 17వ ఓవర్లలో వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. ముందు అభిషేక్‌ శర్మను ఎల్బీగా వెనక్కి పంపాడు. ఆ తర్వాత బంతికే రషీద్‌ ఖాన్‌ గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ 17 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. కేన్‌ విలియమ్సన్‌ 52, విజయ్‌ శంకర్‌ 2 పరుగులుతో ఆడుతున్నాడు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌
రిషబ్‌ పంత్‌ మెరుపు స్టంపింగ్‌తో ఎస్‌ఆర్‌హెచ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. అమిత్‌ మిశ్రా వేసిన ఇన్నింగ్స్‌ 15వ ఓవర్ మూడో బంతిని షాట్‌ ఆడే ప్రయత్నంలో కేదార్‌ జాదవ్‌(9) క్రీజు దాటి ముందుకు వచ్చాడు. ఇదే అదనుగా భావించిన పంత్‌ సెకన్ల వ్యవధిలో వికెట్లను గిరాటేశాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది.

12 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్‌ 88/3
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ మూడో​ వికెట్‌ కోల్పోయింది. ఆవేశ్‌ ఖాన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌ రెండో బంతికి 4 పరుగులు చేసిన విరాట్‌ సింగ్‌ స్టొయినిస్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ 12 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. కేన్‌ విలియమ్సన్‌ 34, కేదార్‌ జాదవ్‌ 1పరుగుతో క్రీజులో ఉ‍న్నారు.

బెయిర్‌ స్టో అవుట్‌
56 పరుగుల వద్ద ఎస్‌ఆర్‌హెచ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 18 బంతుల్లోనే 38 పరుగులతో ధాటిగా ఆడుతున్న బెయిర్‌ స్టో ఆవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ 6 ఓవర్లలో 2 వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది.

తొలి వికెట్‌ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌
160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 6 పరుగులు చేసిన వార్నర్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ 4 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్‌ నష్టానికి 34 పరుగులు చేసింది. బెయిర్‌ స్టో (22), విలియమ్సన్‌(5) క్రీజులో ఉన్నారు.

ఎస్‌ఆర్‌హెచ్‌ టార్గెట్‌.. 160
ఎస్‌ఆర్‌హెచ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటింగ్‌లో పృథ్వీ షా 53 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. పంత్‌ 37, స్మిత్‌ 34 నాటౌట్‌ రాణించారు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో సిద్ధార్థ్‌ కౌల్‌ 2, రషీద్‌ ఖాన్‌ ఒక వికెట్‌ తీశాడు. 

17 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌ స్కోరు 131/2
ఢిల్లీ క్యాపిటల్స్‌ నిలకడగా ఆడుతుంది. ఇప్పటివరకు 17 ఓవర్లలో ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. పంత్‌ 31, స్మిత్‌ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఢిల్లీకి బ్రేకులు వేసిన సన్‌రైజర్స్‌, 14.4 ఓవర్ల తరువాత ఢిల్లీ స్కోర్‌ 114/2
ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతున్న ఢిల్లీ జట్టుకు రషిద్‌ ఖాన్‌ బ్రేకులు వేశాడు. శిఖర్‌ ధవన్‌ను 28 పరుగులు వద్ద బౌల్డ్‌ చేయగా, తరువాతి ఓవర్‌లో పృథ్వీ​షా 53 పరుగుల వద్ద రనౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో పంత్‌, స్వీవ్‌ స్మిత్‌ ఉన్నారు. పంత్‌ సన్‌రైజర్స్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కోంటున్నాడు. 14.4 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది.

చెలరేగి ఆడుతున్న షా..5 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్‌ 48/0
ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ పృథ్వీషా(20 బంతుల్లో 37; 6 ఫోర్లు, సిక్స్‌).. వరుసగా బౌండరీలతో చెలరేగిపోతు​న్నాడు. అతనికి మరో ఓపెనర్‌ ధవన్‌(13 బంతుల్లో 11; ఫోర్‌) సింగల్స్‌ తీస్తూ సహకరించడంతో 5 ఓవర్లు ముగిసే సమయానికి ఢిల్లీ వికెట్లు నష్టపోకుండా 48 పరుగులు చేసింది.

చెన్నై: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌  రిషబ్‌ పంత్‌ తొలుత బ్యాటింగ్‌‌ ఎంచుకున్నాడు. ప్రస్తుత సీజన్‌లో ఇరు జట్లకు ఇది 5వ మ్యాచ్‌ కాగా, ఢిల్లీ 3 మ్యాచ్‌ల్లో నెగ్గి ఒక ఓటమితో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా, హైదరాబాద్‌ పరిస్థితి ఇందుకు పూర్తి వ్యతిరేకంగా ఉంది. హైదరాబాద్‌ గత మ్యాచ్‌లో పంజాబ్‌పై 9 వికెట్ల తేడాతో గెలుపొంది, ప్రస్తుత సీజన్‌లో ఏకైక విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయం మినహా హైదరాబాద్‌ మిగతా మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. 

ఇప్పటివరకూ ఇరు జట్లు  18 సార్లు ముఖాముఖి పోరులో తలపడగా, సన్‌రైజర్స్‌ 11 సార్లు, ఢిల్లీ 7 సందర్భాల్లో విజయం సాధించాయి. అయితే, ఇరు జట్ల మధ్య జరిగిన గత 5 మ్యాచ్‌ల్లో మాత్రం ఢిల్లీదే(3 విజయాలు) పైచేయిగా నిలిచింది. దుబాయ్‌ వేదికగా జరిగిన గత సీజన్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌లో నెగ్గి సమ ఉజ్జీలుగా నిలిచారు. ప్రస్తుత జట్ల బలాబలాల ప్రకారం చూస్తే.. హైదరాబాద్‌ గాయాల బారిన పడి వరుస పరాజయాలతో సతమతమవుతుండగా, కొత్త కెప్టెన్‌ పంత్‌ నేతృత్వంలో ఢిల్లీ వరుస విజయాలతో ఉరకలేస్తుంది. 

సన్‌రైజర్స్‌: వార్నర్‌, బెయిర్‌స్టో, విలియమ్సన్‌, విరాట్‌ సింగ్‌, విజయ్‌ శంకర్‌, అభిషేక్‌ శర్మ, కేదార్‌ జాదవ్‌, రషీద్‌ ఖాన్‌, జగదీశ సుచిత్‌, ఖలీల్‌ అహ్మద్‌, సిద్దార్ధ్‌ కౌల్‌

ఢిల్లీ క్యాపిటల్స్‌: పృథ్వీ షా, ధవన్‌, స్టీవ్‌ స్మిత్‌, రిషబ్‌ పంత్‌, షిమ్రోన్‌ హెట్మేయర్‌, స్టొయినిస్‌, అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌, రబాడ, అమిత్‌ మిశ్రా, ఆవేశ్‌ ఖాన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement